తలైవా తయార్‌!.. ఫ్యాన్స్‌ ఖుషీ | Rajinikanth To Resume Annaatthe Shooting Schedule Soon | Sakshi
Sakshi News home page

తలైవా తయార్‌!.. ఫ్యాన్స్‌ ఖుషీ

Feb 10 2021 8:54 AM | Updated on Feb 10 2021 8:54 AM

Rajinikanth To Resume Annaatthe Shooting Schedule Soon - Sakshi

‘అన్నాత్తే’ షూటింగ్‌ ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్త వినిపిస్తోంది.

చెన్నై : తలైవా రజనీకాంత్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి తయారవుతున్నారట. ఈ వార్త వినగానే తలైవా అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. రజనీ తాజా చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్‌ గత ఏడాది చివర్లో హైదరాబాద్‌లో జరిగినప్పుడు యూనిట్‌లో నలుగురికి కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్‌ పడడం, ఆ తర్వాత రజనీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. ఇక్కడ చికిత్స అనంతరం చెన్నై వెళ్లారాయన. అప్పటినుంచి రజనీ విశ్రాంతిలో ఉంటున్నారు. దాంతో షూటింగ్‌ ఇప్పట్లో ఆరంభం కాదనే వార్తలు వినిపించాయి.

అయితే నవంబరు 4న సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు ఈ రిలీజ్‌ డేట్‌కు తగ్గట్లుగా షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు శివ. ఈ ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్త వినిపిస్తోంది. అంటే.. త్వరలో సూపర్‌ జోష్‌తో సూపర్‌ స్టార్‌ షూటింగ్‌లో పాల్గొంటారన్నమాట..
చదవండి: ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా హెగ్డే
అందుకే ‘ఉప్పెన’ ఈవెంట్‌కి రాలేదు: నాగబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement