Vijay Devarakonda: ఆ స్టార్‌ క్రికెటర్‌ బయోపిక్‌లో నటించాలనుంది

vijay devarakonda Said He Want To Act In Virat Kohli Biopic - Sakshi

విజయ్‌ దేవరకొండ ఇటీవల లైగర్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ చిత్రం దారుణంగా పరాజయం పొందింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ విజయ్‌ ఏమాత్రం తడబడకుండ తన తదుపరి చిత్రాల షూటింగ్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం విజయ్‌ జన గణ మన, ఖషి చిత్రాల షూటింగ్‌ల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఇడియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ను విక్షించిన విజయ్‌ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రద్దు.. భారీగా నష్టపోయిన మేకర్స్‌

మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటర్స్‌ మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్ పఠాన్, వసీం అక్రమ్‌తో కలిసి స్టేడియంలో అడుగుపెట్టిన విజయ్ క్రికెట్ ఆటతో తనకున్న అనుభవాలను పంచుకున్నాడు. ప్రీ మ్యాచ్ షోలో అవకాశం వస్తే ఏ క్రికెటర్ బయోపిక్‌లో నటించాలనుందని కామెంటర్స్ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ధోని భాయ్‌ బయోపిక్‌ చేయాలని ఉండే. కానీ ఆయన బయోపిక్‌ను సుశాంత్‌ సింగ్‌ చేశాడు. ధోనీ కాకుండా కోహ్లి అన్న బయోపిక్‌లో నటించాలనుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.  కోహ్లీ పాత్రకు నేను అయితే కరెక్ట్‌ సూట్‌ అవుతాను అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా

కాగా ప్రపంచవ్యాప్తంగా.. సమకాలీన క్రికెటర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు సాధించాడు. అయితే, ఇటీవలి కాలంలో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కోహ్లి.. ఆసియా కప్‌-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 35 పరుగులు(34 బంతులు), హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో 59 పరుగులు(44 బంతుల్లో- నాటౌట్‌) సాధించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top