ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. మరీ దేవర సంగతేంటి? | Sakshi
Sakshi News home page

Family Star: దేవర ప్లేస్‌లో దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌ డేట్ ఫిక్స్!

Published Fri, Feb 2 2024 5:03 PM

Vijay Devarakonda Family Star Release Date announced - Sakshi

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌'. ఈ చిత్రాన్ని పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీ రిలీజ్‌ తేదీని ప్రకటించారు. ఇటీవలే జరిగిన మీట్‌లో దిల్‌ రాజు చెప్పినట్లే ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

దేవర వాయిదా పడినట్టేనా?

‍అయితే గతంలో అదే రోజున జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తోన్న దేవర కూడా రిలీజ్‌ ఉందని ఇప్పటికే ప్రకటించారు. కొరటాల శివ  డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ వేసవి కానుకగా థియేటర్లో సందడి చేయనుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ మూవీ మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షూటింగ్‌లో భాగంగా సైఫ్‌ అలీఖాన్‌కు గాయాలవడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువల్లే దేవరను వాయిదా వేయనున్నట్లు సమాచారం. ఒకవేళ దేవర పోస్ట్‌ పోన్‌ అయితే అదే రోజున ఫ్యామిలీ స్టార్‌ వస్తుందని దిల్‌ రాజు ఇటీవలే ప్రకటించారు. తాజా ప్రకటనతో జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తోన్న దేవర దాదాపు వాయిదా పడినట్లే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 

Advertisement
Advertisement