'ఫ్యామిలీ స్టార్' కోసం విజయ్‌కి భారీ రెమ్యునరేషన్‌.. ఎన్ని కోట్లంటే..? | Vijay Devarakonda Charge Huge Remuneration For Family Star Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

పెరిగిన 'ఫ్యామిలీ స్టార్' బడ్జెట్‌.. విజయ్‌ దేవరకొండ రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Published Sun, Mar 31 2024 2:07 PM

Vijay Devarakonda Charge Huge Remuneration For Family Star Movie - Sakshi

‘గీతగోవిందం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురాం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించాడు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచారు మేకర్స్‌. ఒకపక్క దిల్‌ రాజు, మరోపక్క విజయ్‌..ఇద్దరు సినిమా ప్రచారంలో బీజీ అయ్యారు.

విజయ్‌కి ఈ సినిమా విజయం చాలా అవసరం. అందుకే ప్రమోషన్స్‌ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. తన తోటి హీరోలా సహాయం కూడా తీసుకుంటున్నాడు. ఏప్రిల్‌ 2న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్‌ చిరంజీవి చీఫ్‌ గెస్ట్‌గా రాబోతున్నట్లు సమాచారం. అలాగే మీడియా ఫ్యామిలీస్‌తో కలిసి ఓ ఈవెంట్‌ కూడా నిర్వహించబోతున్నారు. ఇలా విభిన్నమైన పద్దతుల్లో ప్రచారం నిర్వహించి, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ సినిమా కోసం విజయ్‌ చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. భారీగానే రెమ్యునరేషన్‌ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

రూ. 50 కోట్ల బడ్జెట్‌
విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో గీతగోవిందం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మూవీ తర్వాతనే అటు పరశురాం, ఇటు విజయ్‌ కెరీర్‌ ఊపందుకుంది. మళ్లీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్‌’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే నిర్మాత దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ. 50 కోట్ల బడ్జెట్‌ అయిందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తుంది. వర్కింగ్‌ డేస్‌ ఎక్కువ అవ్వడం వల్ల బడ్జెట్‌ పెరిగిందట. 

‘ఖుషీ’ కంటే ఎక్కువే
ఈ సినిమాకుగాను విజయ్‌ దేవరకొండ భారీగానే పారితోషికాన్ని పుచ్చుకున్నాడట. మొత్తంగా రూ. 15 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది గత చిత్రం ఖుషీ కంటే ఎక్కువ. ఖుషీ చిత్రానికి విజయ్‌ రూ.12 కోట్లు తీసుకున్నాడు. అయితే ఆ చిత్రం ఓ మోస్తరు విజయం మాత్రమే అందుకుంది. అంతకు ముందు వచ్చిన లైగర్‌ భారీ డిజాస్టర్‌ అయింది. అయినా కూడా విజయ్‌ మార్కెట్‌ పడిపోలేదు. అందుకే రూ. 15 కోట్ల రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు వెనుకాడలేదట దిల్‌ రాజు. 

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంతంటే..
ఏప్రిల్‌ 5న ఫ్యామిలీ స్టార్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో సోలోగా రిలీజ్‌ అవుతున్న ఏకైక పెద్ద సినిమా ఇదే అని చెప్పొచ్చు. తొలుత తెలుగు, తమిళ్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. రెండు వారాల తర్వాత హిందీలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ చిత్రం ప్రిరిలీజ్‌ బిజినెస్‌  కూడా భారీగానే అయింది. అన్ని ఏరియాల్లో కలిసి రూ. 45 కోట్ల మేర బిజినెస్‌ చేసిందట. గీతగోవిందం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన కారణంగానే విజయ్‌ ఫ్లాప్స్‌లో ఉన్నా.. భారీ స్థాయిలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అయింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement