Vidya Balan: అవి హీరోల చిత్రాలు.. అందుకే ఫ్లాప్ అయ్యాయి: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా బాలన్ తన రెండు సినిమాలు పరాజయం కావడానికి కారణం హీరోలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె కెరీర్ ప్రారంభ రోజులకు గుర్తు చేసుకుంది. తన నటించిన తొలి ఏడు సినిమాల్లో రెండు ఫ్లాప్ అయ్యాయని, దానికి కారణం అవి హీరోలు ప్రాధాన్యంగా తీసిన సినిమాలని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో నా నిర్ణయాల గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు నేను సంప్రదాయమైన సినిమాలు చేయలేదు. అందుకే నేను పెద్దగా సక్సెస్ కాలేకపోయాను. సినిమా ప్రమోషన్స్‌లో కూడా మీరు మరో అన్‌కన్వెన్షనల్(సంప్రదాయం కానీ సినిమాలు) చేస్తున్నారా? అని ప్రశ్నించేవారు’ అని చెప్పుకొచ్చింది.
చదవండి: జిమ్ చేస్తుండగా నటుడికి గుండెపోటు!
ఆ తర్వాత ‘అయితే ప్రజల అభిప్రాయాలకు నేను ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ, నా నిర్ణయాలను తిరిగి సమీక్షించుకుంటుంటే మాత్రం ఆశ్యర్యం కలుగుతోంది. సంప్రదాయబద్ధమైన సినిమాలు చేయకపోవడం వల్లే నేను అంతగా సక్సెస్ చూడలేకపోయి ఉండొచ్చు. నేను చేసిన చిత్రాల్లో విజయం సాధించని సినిమాలన్ని మహిళా ప్రాధాన్యం కానీవే!’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా విద్యా బాలన్ పరిణణీత(2005) సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లగే రహో మున్నా భాయ్, గురు, హే బేబీ, భూల్ భూలయ్యా, కిస్మత్ కనెక్షన్, పా చిత్రాల్లో నటించింది. ఇక 2011లో సిల్క్ స్మిత బయోపిక్‌గా వచ్చిన ద డర్టీ పిక్చర్‌లో నటించింది. ఇందులో ఆమె నటనకు గానూ జాతీయ అవార్డును గెలుచుకుంది.
మరిన్ని వార్తలు