చలిలో వణుకుతూ.. అయినా షూటింగ్‌ ఆపని జక్కన్న

Video Viral: RRR Movie Shooting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(రౌద్రం రణం రుధిరం). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. విప్లవ వీరులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో కోమురం భీంగా ఎన్టీఆర్‌, సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. అలియాభట్‌, ఓలివియా మోరీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఏడు నెలలు ఆగిపోయిన ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ తిరిగి ఇటీవల అన్ని జాగ్రత్తలతో ప్రారంభమైంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌‌

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక సెట్‌ వేసి మిగిలిన షూటింగ్‌ భాగాన్ని జరుపుకోంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని బీఏ రాజు తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘శీతాకాలం చలి పనులకు ఆపలేదు’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియోలో దర్శకుడు రాజమౌళితో, కెమెరామెన్‌ సింథిల్‌తోపాటు చిత్ర యూనిట్‌ కలిసి కరోనా నిబంధనలు మేరకు మాస్కులు దరించి చ‌లికి వ‌ణుకుతూ షూటింగ్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌కు రాజమౌళి షూట్‌ సీన్‌ను వివరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాదే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. అయితే కరోనా కారణంగా వచ్చే వాయిదా పడగా.. వచ్చే ఏడాది థియేటర్లో విడుదల కానుంది. ఆ హీరోకు పెద్ద ఫ్యాన్‌: ఉప్పెన హీరోయిన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top