‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్‌ రెమ్యునరేషన్‌!, 15 నిమిషాలకే అన్ని కోట్లా? | Victory Venkatesh Shocking Remuneration For Ori Devuda Movie | Sakshi
Sakshi News home page

Venkatesh Remunaration For Ori Devuda: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్‌ రెమ్యునరేషన్‌!, 15 నిమిషాలకే అన్ని కోట్లా?

Published Mon, Oct 24 2022 1:48 PM | Last Updated on Mon, Oct 24 2022 2:20 PM

Victory Venkatesh Shocking Remuneration For Ori Devuda Movie - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఓరి దేవుడా’. తమిళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అశ్వథ్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో విక్టరి వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్‌ సేతుపతి క్యారెక్టర్‌ను తెలుగులో వెంకటేశ్‌ చేశారు. కథను మలుపు తిప్పే దేవుడి పాత్రలో ఆయన కనిపించారు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా సినిమాకు హైలెట్‌గా నిలిచారు.

చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్‌

అయితే ఈ సినిమా కోసం వెంకి భారీగానే పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కనిపించింది 15 నిమిషాలే యంగ్‌ హీరో రెమ్యునరరేషన్‌ స్థాయిలో ఆయనకు మేకర్స్‌ భారీ మొత్తం చెల్లించినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓరి దేవుడా సినిమాలో వెంకి తన పాత్ర కోసం 5 రోజుల కాల్‌షీట్‌ ఇచ్చారట. ఈ 5 రోజుల షూటింగ్‌, 15 నిమిషాల నిడివికి ఆయన దాదాపు రూ. 3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ సినిమాలో ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. 

చదవండి: Mega 154 Title: మెగా 154 టైటిల్‌ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్‌ లుక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement