Janhvi Kapoor: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్‌

Janhvi Kapoor Advice to Khushi Kapoor That Not Date With an Actor - Sakshi

దివంగత అతిలోకసుందరి, నటి శ్రీదేవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్‌ సినిమాను ఏలిన నటి ఆమె. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ప్రముఖ నిర్మాత అన్నది తెలిసిందే. ఈయన తమిళంలో అజిత్‌ కథానాయకుడిగా నేర్కొండ పార్త్వె, వలిమై తదితర చిత్రాలను నిర్మించారు. తాజాగా అజిత్‌ హీరోగా నిర్మిస్తు న్న తుణివు చిత్రం సంక్రాంతికి విడుదలకు ముస్తాబవుతోంది. కాగా వీరి వారసురాలిగా జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో కథానాయకిగా రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే.

చదవండి: మరోసారి మాజీ ప్రియుడితో సుష్మితా, నటిపై నెటిజన్ల అసహనం

తొలి చిత్రంలోనే నటిగా ప్రశంసలు అందుకున్న జాన్వీ కపూర్‌ మంచి నటిగా ఎదిగే ప్రయత్నంలో ఉంది. అయితే ఈమెలో నటించగల సత్తా ఉన్నా ఎందుకనో గ్లామర్‌ పైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. సామాజిక మాధ్యమాల్లో తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. కాగా జాన్వీ కపూర్‌ను దక్షిణాది సినిమాకు పరిచయం చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె కూడా సౌత్‌ సినిమాల్లో నటించాలన్న ఆసక్తిని పలుమార్లు వ్యక్తం చేసింది. అలాంటి రోజు ఇంకా ఆమెకు రాలేదు. అయితే దక్షిణాదిలో సక్సెస్‌ సాధించిన చిత్రాల హిందీ రీమేక్‌లలో జాన్వీ కపూర్‌ నటిస్తుండడం విశేషం.

చదవండి: సర్ధార్‌ సక్సెస్‌ మీట్‌: నాగార్జున అన్న సపోర్ట్‌ని మర్చిపోలేను: హీరో కార్తీ

అలా మలయాళ చిత్రం హె లెన్‌ హిందీ రీమేక్‌లో, తమిళంలో నయనతార నటించిన కొలమావు కో కిల చిత్ర రీమేక్‌లోనూ నటించి ప్రశంసలు అందుకుంది. కాగా తాజాగా ఈమె సోదరి ఖుషీ కపూర్‌ కూడా హీరోయిన్‌గా బాలీవుడ్‌లో పరిచయం కావడానికి సిద్ధమవుతోంది. దీంతో చెల్లెలికి ఏమైనా సలహాలు సూచనలు, ఇచ్చారా? అన్న ప్రశ్నకు జాన్వీ బదులిస్తూ నటుడిని ప్రేమించవద్దని సలహా ఇచ్చినట్లు చెప్పింది. అలాగే ముందుగా నీ గౌరవం ఏమిటి? అన్నది తెలుసుకోమని, అదే నిన్ను ముందుకు నడిపిస్తుందని చెప్పానంది. సినిమా నటి అయిన తరువాత పలువురు పలు రకాలుగా విమర్శలు చేస్తారని, వాటిని అస్సలు పట్టించుకోవద్దని సలహా ఇచ్చినట్లు నటి జాన్వీ కపూర్‌ పేర్కొంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top