Hero Karthi: నటుడిగా ఉండటం నా అదృష్టం: కార్తీ

Karthi Interesting Comments At Sardar Movie Success Meet - Sakshi

‘‘ఖాకీ, ఖైదీ’ చిత్రాల్లానే కొత్తగా చేస్తే తప్పకుండా ఆదరిస్తామని ‘సర్దార్‌’తో మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. మా కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో కార్తీ అన్నారు. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్‌’. రాశీఖన్నా, రజీషా విజయన్‌ కథానాయికలు. లైలా కీలక పాత్రలో నటించారు. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున రిలీజ్‌ చేశారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌లో హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘‘నాగార్జున అన్న సపోర్ట్‌ని మర్చిపోలేను. సినిమా అనేది ఒక సంస్కృతిగా ఉన్న మన దేశంలో ఒక నటుడిగా ఉండటం నా అదృష్టం’’ అన్నారు. ‘‘తెలుగులో ‘సర్దార్‌’ విడుదల చేసినందుకు గర్వంగా ఉంది. మంచి సినిమాని ఆదరించే తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్లు’’ అన్నారు నిర్మాత సుప్రియ. ‘‘నా తొలి చిత్రం ‘అభిమన్యుడు’ సినిమాని తెలుగు ప్రేక్షకులు హిట్‌ చేశారు. ఇప్పుడు ‘సర్దార్‌’కి మరో ఘన విజయం ఇచ్చినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు పీఎస్‌ మిత్రన్‌. రజీషా విజయన్, నటుడు–రచయిత రాకేందుమౌళి మాట్లాడారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top