వెంకటేశ్‌ చేతుల మీదుగా అనసూయ, సునీల్‌ ‘దర్జా’ మూవీ ట్రైలర్‌ | Victory Venkatesh Released Anasuya Bharadwaj, Sunil Darja Movie Trailer | Sakshi
Sakshi News home page

Darja Movie Trailer Launch: వెంకటేశ్‌ చేతుల మీదుగా అనసూయ, సునీల్‌ దర్జా మూవీ ట్రైలర్‌

Published Sat, Jun 11 2022 8:54 AM | Last Updated on Sat, Jun 11 2022 8:54 AM

Victory Venkatesh Released Anasuya Bharadwaj, Sunil Darja Movie Trailer - Sakshi

Venkatesh Released Darja Movie Trailer: సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వంలో శివ శంకర్‌ పైడిపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖర్లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్‌ రిలీజ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌ రిచ్‌గా, చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. 

చదవండి: మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో సినిమా చేయను: ప్రముఖ నిర్మాత

‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో ‘దర్జా’ రిలీజ్‌ ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నాం. సినిమా రిలీజ్‌ డేట్‌పై త్వరలో స్పష్టత ఇస్తాం’ అన్నారు నిర్మాతలు. ‘దర్జా’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సలీం మాలిక్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ర్యాప్‌రాక్‌ షకీల్‌తో పాటు చిత్రయూనిట్‌ పాల్గొంది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement