
ముంబై: అలనాటి సంగీత దర్శకుడు వన్‌రాజ్ భాటియా(93) తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. వన్‌రాజా భాటియా.. మంతాన్, భూమిక, జానే బీదో యార్ సహా పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. బుల్లితెర మీద టామస్, భరత్ ఏక్ ఖోజ్ వంటి పలు షోలకు సైతం మ్యూజిక్ అందించారు. శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో చాలావరకు భాటియా సంగీతం అందించినవే.
సంగీంతంలో ఆయన అందించిన సేవలకుగానూ భాటియా 2012లో పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు. సుమారు 700కు పైగా జింగిల్స్(తక్కువ నిడివి ఉండే ట్యూన్స్) కంపోజ్ చేశారు. చిత్రపరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఎన్నో హిట్ సాంగ్స్‌ను అందించి గుర్తింపు పొందిన భాటియాను వృద్యాప్యంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తనకు వైద్యం చేయించుకునేందుకు ఇంట్లోని వస్తువులను సైతం అమ్మేయాల్సి రావడం విషాదకరం.
చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్‌కు కోవిడ్ ఎలా సోకిందంటే..