ఆస్పత్రిలో చేరిన నటి హేమా చౌదరి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి | Veteran Actress Hema Choudhary Hospitalised Due To Brain Hemorrhage, Health Condition Is Critical - Sakshi
Sakshi News home page

Actress Hema Choudhary Health Condition: ఆస్పత్రిలో చేరిన నటి హేమా చౌదరి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి

Published Wed, Dec 20 2023 11:42 AM

Veteran Actress Hema Choudhary Hospitalised - Sakshi

సౌత్‌ ఇండియ ప్రముఖ నటి హేమా చౌదరి బ్రెయిన్‌ హెమరేజ్‌ కారణంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడంతో ఆమె కుమారుడు కూడా నేడు  విదేశాల నుంచి వస్తున్నాడు. నటి హేమా చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించి ఆపై తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో 100కు పైగా చిత్రాల్లో మెప్పించింది.

కన్నడలో డా. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్‌నాగ్, అనంతనాగ్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో నటించారు. కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, ప్రేమ్ నజీర్ తదితరులతో కూడా నటించారు. కె.బాలచందర్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో కూడా హేమా చౌదరి నటించారు.

పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం వంటి చిత్రాల్లో ఆమె నటించించారు. ఆపై కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్సకు స్పందించడం లేదు. విదేశాల నుంచి కుమారుడి రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement