
బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ శుక్రవారం (83) ఏళ్ల వయసులో మరణించారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపుడుతున్నారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా దేబ్ మరణించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్‌లో దేబ్ ముఖర్జీ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వారి కుటుంబంలో నిర్మాతలు, దర్శకులు అనేకమంది ఉన్నారు. ఆయన కుమారుడు ఆయాన్ ముఖర్జీ 'వార్2' డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దేబ్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని పవన్ హన్స్‌లో శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు ఓ ప్రకటలో తెలిపారు.
దేబ్ ముఖర్జీ అంత్యక్రియలలో బాలీవుడ్ స్టార్స్ పాల్గొననున్నారు. కాజోల్, రాణి ముఖర్జీ ఇద్దరూ కూడా దేబ్ ముఖర్జీకి మేనకోడళ్ళు అవుతారు. దీంతో వారు తప్పకుండా అక్కడకు రానున్నారు. వారితో పాటుగా అజయ్ దేవ్‌గన్, తనూజ, తనిషా, ఆదిత్య చోప్రాతో సహా ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ వంటి ఆయన్ ముఖర్జీ స్నేహితులు కూడా అంత్యక్రియలకు హాజరవుతారని భావిస్తున్నారు.
దేబ్ ముఖర్జీ కుమారుడు అయాన్ ముఖర్జీ వార్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment