
ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29న) తెల్లవారుజామున కన్నుమూశారు. తండ్రి మరణంతో వేణు ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. వెంకట సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.