ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది | Venu Donepudi about Baba Black Sheep public talks | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది

Oct 13 2026 5:02 AM | Updated on Oct 13 2026 5:02 AM

Venu Donepudi about Baba Black Sheep public talks

– నిర్మాత వేణు దోనేపూడి 

‘‘బా బా బ్లాక్‌ షీప్‌’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్లు, నార్త్‌లో వంద థియేటర్లు, ఓవర్సీస్‌లోనూ రిలీజ్‌ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అన్ని చోట్లా బ్రేక్‌ ఈవెన్‌ అయింది’’ అని నిర్మాత  వేణు దోనేపూడి తెలిపారు. టిను ఆనంద్, ఉపేంద్ర, మాళ్వీ మల్హోత్రా,  రాజారవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బా బా బ్లాక్‌ షీప్‌’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 9న రిలీజ్‌ అయింది. 

ఈ క్రమంలో వేణు దోనేపూడి మాట్లాడుతూ–‘‘అక్కినేని నాగేశ్వరరావుగారిని నేను తాతగారు అని పిలిచేవాణ్ణి. ఆయన మాట ప్రకారం నేను ‘మనం’ సినిమాలో వెనకాల ఎక్కడో కనిపిస్తాను. ‘మనం’ తర్వాత గోపీ మోహన్, శ్రీను వైట్ల పరిచయం అయ్యారు. అలా గోపీచంద్‌తో ‘విశ్వం’ మూవీ తీశా. గుణి కథ నచ్చడంతో ‘బా బా బ్లాక్‌ షీప్‌’ తీశాను. బెల్లంకొండ శ్రీనివాస్‌తో తీయనున్న ‘రామం’ మూవీ నా కలల ప్రాజెక్ట్‌. ‘గాంధీతాత చెట్టు’ డైరెక్టర్‌ పద్మావతితో ఓ లవ్‌ మూవీ చేస్తున్నాను. అలాగే ఇద్దరు స్టార్‌ హీరోలతోనూ ఓ మూవీ లైనప్‌లో ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement