breaking news
Tinu Anand
-
ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది
‘‘బా బా బ్లాక్ షీప్’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్లు, నార్త్‌లో వంద థియేటర్లు, ఓవర్సీస్లోనూ రిలీజ్ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయింది’’ అని నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. టిను ఆనంద్, ఉపేంద్ర, మాళ్వీ మల్హోత్రా, రాజారవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 9న రిలీజ్ అయింది. ఈ క్రమంలో వేణు దోనేపూడి మాట్లాడుతూ–‘‘అక్కినేని నాగేశ్వరరావుగారిని నేను తాతగారు అని పిలిచేవాణ్ణి. ఆయన మాట ప్రకారం నేను ‘మనం’ సినిమాలో వెనకాల ఎక్కడో కనిపిస్తాను. ‘మనం’ తర్వాత గోపీ మోహన్, శ్రీను వైట్ల పరిచయం అయ్యారు. అలా గోపీచంద్‌తో ‘విశ్వం’ మూవీ తీశా. గుణి కథ నచ్చడంతో ‘బా బా బ్లాక్ షీప్’ తీశాను. బెల్లంకొండ శ్రీనివాస్‌తో తీయనున్న ‘రామం’ మూవీ నా కలల ప్రాజెక్ట్. ‘గాంధీతాత చెట్టు’ డైరెక్టర్ పద్మావతితో ఓ లవ్ మూవీ చేస్తున్నాను. అలాగే ఇద్దరు స్టార్ హీరోలతోనూ ఓ మూవీ లైనప్‌లో ఉంది’’ అన్నారు. -
మేరీ జానీ బాగుంది – దేవిశ్రీ ప్రసాద్
టిను ఆనంద్, అక్షయ్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, విష్ణు ఓ.ఐ ప్రధాన పాత్రల్లో నటించిన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్‌షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో గుణి మంచికంటి దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియో పతాకంపై వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 9న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఆజా మేరీ జానీ పాట లిరికల్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసి, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ బాగుందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఎలక్ట్రానిక్ కిలి – ఆనంద్ ద్వయం సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ రాయగా, బెన్నీ దయాల్ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఆజా మేరీ..’ ఒక పార్టీ సాంగ్. అక్షయ్ – విష్ణు ఓయ్ ఈ పాటలో కనిపిస్తారు. పూర్తిగా మేఘాలయా రాష్ట్రంలో చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా మాదే. అనుకోకుండా జరిగే ఓ ఘటన కొన్ని సందర్భాల్లో మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటానికి కారణమవుతాయి. ఇలాంటి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని తెలిపారు.


