బాక్సింగ్‌ పంచ్‌కి రెడీ అయిన వరుణ్‌తేజ్‌ | Varun Tejs Ghani Locks Deepavali Release Date | Sakshi
Sakshi News home page

బాక్సర్‌గా వరుణ్‌.. 'గని' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Aug 5 2021 6:02 PM | Updated on Aug 5 2021 9:14 PM

Varun Tejs Ghani Locks Deepavali Release Date - Sakshi

Varun Tej : మెగా హీరో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం గని. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఈ చితత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు వరుణ్‌ తేజ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే విడదులైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఈ సినిమా కోసం వరుణ్‌ ప్రత్యేకంగా  ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేకాకుండా యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ను రంగంలోకి దించారు. ఇక వరుణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement