ఆగస్టులో అర్జున

Varun Tej-Praveen Sattaru Gandheevadhari Arjuna Release Date Fix - Sakshi

గాంఢీవాన్ని ఎక్కుపెట్టి థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అవుతున్నాడు అర్జున. వచ్చే తేదీని కూడా ఫిక్స్‌ చేసుకున్నాడు. వరుణ్‌ తేజ్‌ టైటిల్‌ రోల్‌లో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘గాంఢీవధారి అర్జున’. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 25న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుగుతోంది.

‘‘స్టైలిష్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో రూపొందిస్తోన్న ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన వరుణŠ  లుక్‌కి, వీడియో గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: ముఖేష్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top