అల్లు అర్జున్‌ ఇంట్లో వరలక్ష్మి శరత్‌కుమార్‌.. ఫోటోలు వైరల్‌ | Varalaxmi And Nicholai Sachdev Invited Allu Arjun And His Family For Their Wedding | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ ఇంట్లో వరలక్ష్మి శరత్‌కుమార్‌.. ఫోటోలు వైరల్‌

Published Fri, Jun 21 2024 3:17 PM | Last Updated on Fri, Jun 21 2024 4:10 PM

Varalaxmi Sarathkumar Visit Allu Arjun Home

సౌత్‌ ఇండియా చిత్రపరిశ్రమలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఆమె చేసింది. అయితే, సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను ఆమె  వివాహం చేసుకోనుంది. ఇప్పటికే వారి  ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగిన విషయం తెలిసిందే.

పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో తన సన్నిహితులతో పాటు సౌత్‌ ఇండియా చిత్రపరిశ్రమలోని చాలామంది ప్రముఖులను తన వివాహానికి రావాలంటూ వరలక్ష్మి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే  రజినీకాంత్, కమల్ హాసన్, సమంత,ర‌వితేజ, ప్ర‌శాంత్ వ‌ర్మ‌,త‌మ‌న్, గోపిచంద్ మ‌లినేని వంటి స్టార్స్‌కు  వెడ్డింగ్ కార్డ్స్‌ అందజేసి ప్రత్యేకంగా అహ్వానించింది.

అయితే తాజాగా తనకు కాబోయే భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌తో కలిసి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇంటికి వరలక్ష్మి చేరుకుంది. తమ వివాహానికి రావాలని ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. అదే సమయంలో ప్రముఖ నిర్మాత అ‍ల్లు అరవింద్‌కు తమ ఆహ్వాన పత్రికను అందించింది. ఆ సమయంలో బన్నీతో వారు ఫోటోలు దిగారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌ అవతున్నాయి. వరలక్ష్మి,  నికోలాయ్ సచ్‌దేవ్‌ల వివాహం జులై 2న థాయ్‌ల్యాండ్‌లో జరగనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement