
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా.. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. మే 3న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. గత కొన్నాళ్ల నుంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'అలిసిన ఊపిరి...' పాటను దర్శకుడు కరుణ కుమార్ చేతుల మీదగా విడుదలైంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)
'శబరి' నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటల్లో తల్లి కూతుళ్ల అనుబంధం, ప్రేమను చూపిస్తే... 'అలిసిన ఊపిరి' పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న వరలక్ష్మిని చూపించారు. మధ్యలో కుమార్తె కోసం అన్వేషణలో పడిన తల్లి మనసును సైతం స్పృశించారు. గోపీసుందర్ బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, రెహమాన్ సాహిత్యం దీనినొక మోటివేషనల్ సాంగ్ తరహాలో మార్చాయి.
(ఇదీ చదవండి: అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార)