అమ్మవారి పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. షూటింగ్‌ ప్రారంభం | Varalaxmi Sarathkumar Plays Durga Role In Kanaka Durga Movie | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar : అమ్మవారి పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. షూటింగ్‌ ప్రారంభం

Aug 12 2022 11:00 AM | Updated on Aug 12 2022 11:01 AM

Varalaxmi Sarathkumar Plays Durga Role In Kanaka Durga Movie - Sakshi

సుమంత్‌ శైలేంద్ర, మేఘా ఆకాష్‌ జంటగా రూపొందుతున్న ‘ఓం శ్రీ కనకదుర్గ’ చిత్రం గురువారం ఆరంభమైంది. కనకదుర్గ అమ్మవారి పాత్రను వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పోషిస్తున్నారు. లంకా ఫణిధర్‌ సమర్పణలో స్వీయ దర్శకత్వంలో లంకా శశిధర్‌ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాత డీయస్‌ రావు కెమెరా స్విచాన్‌ చేయగా, నిర్మాత అంబికా కృష్ణ క్లాప్‌ ఇచ్చారు.

నిర్మాత సైలేంద్ర బాబు స్క్రిప్ట్‌ అందించగా, డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కాశీ విశ్వనాథ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తున్నాను’’ అన్నారు మురళీమోహన్‌. ‘‘అమ్మవారి నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్‌తో లవ్, ఎంటర్‌టైనర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని దర్శక–నిర్మాత లంకా శశిధర్‌ అన్నారు. ‘‘మా చిన్నబ్బాయి శశిధర్‌కు సినిమాలంటే చిన్నప్పటి నుండి ఇష్టం.

దర్శకుడు కావాలనే తన కల ఈ చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు లంకా శివశంకర్‌ ప్రసాద్‌. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ కె. ప్రసన్, కెమెరా: శ్రీచిత్‌ విజయన్‌ దామోదర్, లైన్‌ ప్రొడ్యూసర్‌: జేత్రం మహేష్‌ రెడ్డి .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement