సంక్రాంతి మూవీస్.. ఆమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా? | Sakshi
Sakshi News home page

పండగ సినిమాలకు లక్కీ ఛార్మ్ అయిపోతున్న ఆ నటి.. ఆమె ఎవరో తెలుసా?

Published Sat, Jan 13 2024 8:35 PM

Varalaxmi Sarathkumar Lucky Actress For Sankranthi Telugu Movies - Sakshi

ఈమె ఓ సినిమాలో నటించి.. అది సంక్రాంతికి రిలీజ్ అయితే హిట్ గ్యారంటీ! అబచ్చా.. ఈమె యాక్ట్ చేస్తే హిట్ కొట్టడం ఏంటి బాసూ.. సినిమాలో దమ్ముండాలి. జనాలకు అది నచ్చాలి కదా? అని మీరు అనుకోవచ్చు. కానీ గత మూడు-నాలుగేళ్లుగా చూసుకుంటే మాత్రం పండక్కి వచ్చే చిత్రాలకు ఈమె లక్కీ ఛార్మ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె అదృష్టం సంగతేంటి?

పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు వరలక్ష్మి శరత్ కుమార్. సాధారణంగా అలాంటి పొట్టిపొట్టి బట్టల్లో అయితే కనిపించదు. ఎందుకంటే ఈమె హీరోయిన్ కాదు. ఒకప్పుడు హీరోయిన్‌గా చేసింది గానీ హిట్స్ పడలేదు. దీంతో రూట్ మార్చేసింది. తొలుత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసింది. అవి క్లిక్ అయ్యేసరికి ఇలాంటివే చేస్తూ వచ్చింది. అయితే ఈమెలోని అద్భుతమైన నటిని గుర్తిస్తున్న పలువురు డైరెక్టర్స్.. ఈమెకు డిఫరెంట్ రోల్స్ ఇస్తూ ప్రోత్సాహిస్తున్నారు.

(ఇదీ చదవండి: క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్)

అలా తెలుగులోనూ గత నాలుగైదేళ్లలో వరలక్ష్మికి మంచి మంచి రోల్స్ పడ్డాయి. 2021 సంక్రాంతికి రవితేజ 'క్రాక్'లో విలన్ భార్యగా నటించింది. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అదరగొట్టేసింది. ఇక గతేడాది పండక్కి వచ్చిన 'వీరసింహారెడ్డి' చిత్రంలోనూ హీరోకి చెల్లెలి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. తాజాగా 'హను-మాన్'లోనూ హీరోకి అక్క పాత్రలో ఉన్నది కాసేపే అయినా కేక పుట్టించేసింది.

అనుకోకుండా జరిగినా సరే 2021, 2023, 2024లో సంక్రాంతికి వచ్చి హిట్ అయిన సినిమాల్లో ఈమె నటించడంతో వరలక్ష్మిని... పండగ సినిమాల లక్కీ ఛార్మ్ అని అంటున్నారు. అయితే ఈమె ఉన్నంత మాత్రాన హిట్ అయిపోలేదు. సినిమాలో కంటెంట్‌కి తోడు వరలక్ష్మి యాక్టింగ్ కూడా కలిసొచ్చి ఇప్పుడు ఈమె.. టాలీవుడ్‌లో స్టార్ యాక్టర్ అయిపోయిందనొచ్చు.

(ఇదీ చదవండి: ఆ జ్ఞాపకాల్లోనే మెగాడాటర్.. ముద్దులిచ్చేస్తున్న 'బిగ్‌బాస్ 7' బ్యూటీ!)

Advertisement
 
Advertisement
 
Advertisement