సమంతను పెళ్లికి ఆహ్వానించిన హనుమాన్ నటి..! | Varalaxmi Sarathkumar Invites Samantha Ruth Prabhu To Her Wedding, Pic Goes Viral | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar: సమంతను పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మి..!

Published Thu, Jun 13 2024 8:57 PM | Last Updated on Fri, Jun 14 2024 10:42 AM

Varalaxmi Sarathkumar invites Samantha Ruth Prabhu to her wedding

హనుమాన్‌ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 2వ తేదీన థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి తన పెళ్లికి అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్‌ స్టార్స్‌ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లకు వెడ్డింగ్ కార్డ్స్‌ అందజేసి ప్రత్యేకంగా అహ్వానించారు.

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత, బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్‌ను తన పెళ్లికి ఆహ్వానించింది. వ్యక్తిగతంగా కలిసి వారికి ఆహ్వాన పత్రికలు అందజేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కాగా... టాలీవుడ్‌లో ఇప్పటికే రవితేజ, డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మకు కలిసి పెళ్లికి రావాలని కోరింది. ఇటీవల తన తండ్రి శరత్‌కుమార్, రాధికాతో పాటు కోలీవుడ్‌ ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు.  

కాగా.. ఈ ఏడాది మార్చిలో వరలక్ష్మి, నికోలాయ్‌ల నిశ్చితార్థం జరిగింది. నికోలయ్‌ సచ్‌దేవ్‌తో దాదాపుగా 14 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు వరలక్ష్మి తెలిపింది. మరోవైపు  సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్‌, ధనుష్ నటిస్తోన్న రాయన్‌ చిత్రంలో వరలక్ష్మి కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement