శరవేగంగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ సినిమా షూటింగ్‌

Varalakshmi Sarathkumar Kondraal Paavam Major Schedule Wrapped - Sakshi

తమిళసినిమా: నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కొండ్రాల్‌ పావం. నటుడు సంతోష్‌ ప్రతాప్, ఈశ్వరిరావు, చార్లీ, మనోబాల, జయకుమార్, మీసై రాజేంద్రన్, సుబ్రమణ్యం శివ, ఇమ్రాన్, సెండ్రాయన్, టీఎస్‌ఆర్‌ శ్రీనివాసన్, రాహుల్, కవితా భారతి, తంగదురై, కల్యాణి మాధవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇన్చ్‌ స్టూడియోస్‌ పతాకంపై ప్రతాప్‌ కృష్ణ, మనోజ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ఈ నెల మొదట్లో ప్రారంభించిన ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే అధిక భాగం షూటింగ్‌ పూర్తయినట్లు తెలిపారు. రచయిత మోహన్‌బాబు రాసిన ప్రముఖ నాటకాన్ని కొండ్రాల్‌ పావం పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. దీనిని తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు వెర్షన్‌ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత అల్లు అరవింద్‌ ఆహా ఓటీటీ కోసం నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో సెట్‌ వేసి షూటింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే షూటింగ్‌ చాలా వరకు పూర్తయిందని, త్వరలోనే మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి చెళియన్‌ చాయాగ్రహణను, శ్యామ్‌ సీ ఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి టీ పిక్చర్స్‌ సంస్థ సహ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top