US: Girls Dance To Saami Saami Song From Pushpa Movie Video Goes Viral - Sakshi
Sakshi News home page

Trending Pushpa Song: తగ్గని మేనియా, అల్లు అర్జున్‌ పాటకు అమెరికా అమ్మాయిలు డాన్స్‌

Mar 31 2022 4:27 PM | Updated on Mar 31 2022 4:40 PM

US Girls Dance To Saami Saami Song From Pushpa Movie Video Goes Viral - Sakshi

దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బన్నీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఇక సినిమాలోని డైలాగులు, పాటలు అన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీవల్లి, సమంత ఐటెం సాంగ్‌ ఊ అంటావా.. ఊఊ ఉంటావా, రారా సామీ పాటలు ఎంతగా పాపులర్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటీకి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫా, పలు ఈవెంట్లలో ఈ పాటలే మారుమోగుతున్నాయి.

చదవండి: సూర్య ఈటీ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

ఇక మూవీ విడుదలైన నాలుగు నెలలు కావోస్తున్న ఇప్పటికీ పుష్ప మేనియా తగ్గలేదు. తాజాగా ఇందులో రారా సామీ పాటకు ఇద్దరు ఇండియన్‌ అమెరికా అమ్మాయిలు స్టెప్పులేసిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. రాధాప్రియాంక అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇద్దరు అమ్మాయిలు లంగాఓణిలు ధరించి రారా సామీ పాటకు డాన్స్‌ చేస్తూ కనిపించారు. దీనికి ‘సామీ ఫ్యాన్స్‌’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌, డైరెక్టర్‌ రాజమౌళిపై కంగనా కామెంట్స్‌, పోస్ట్‌ వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement