Kangana Ranaut Comments on SS Rajamouli RRR Movie - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: ఆర్‌ఆర్‌ఆర్‌, డైరెక్టర్‌ రాజమౌళిపై కంగనా కామెంట్స్‌, పోస్ట్‌ వైరల్‌

Mar 30 2022 8:22 PM | Updated on Mar 30 2022 9:43 PM

Kangana Ranaut Comments On RRR Movie And SS Rajamouli - Sakshi

ఇక్కడ ఆయన గురించి చెప్పుకునే మరో విషయం ఏమిటంటే.. రాజమౌళి గారు ఒక సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు.. మానవత్వం ఉన్న గొప్ప మనిషి. దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పది

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. మరోసారి తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ఇది. బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కించిన ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ పాన్‌ ఇండియా మూవీ 4 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్‌ఆర్‌ఆర్‌ మానియానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రేక్షకుత  నుంచి సినీ సెలబ్రెటీలు వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా హిందీలో సైతం రూ. 100 కోట్లు కలెక్షన్స్‌ రాబట్టింది.

చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌

ఈ మూవీ చూసిన బాలీవుడ్‌ నటీనటులు, సినీ ప్రముఖులు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ, జక్కన్నపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాజమౌళి ఫొటోను షేర్‌ చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించింది. ‘ఎప్పటికీ రాజమౌళి సార్‌ భారతీయ చలచిత్రాల గొప్ప దర్శకుడని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కెరీర్‌లోనే ప్లాప్‌ సినిమాలు లేదు, భవిష్యత్తులో కూడా ఉండవు’ అని పేర్కొంది. అలాగే మరో పోస్ట్‌లో ‘ఇక్కడ ఆయన గురించి చెప్పుకునే మరో విషయం ఏమిటంటే.

చదవండి: నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా: సమీరారెడ్డి

రాజమౌళి గారు ఒక సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు.. మానవత్వం ఉన్న గొప్ప మనిషి. దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పది. మీలాంటి రోల్‌ మోడల్‌ ఉండటం అదృష్టం సార్‌. నిజాయితిగా నేను మీకు పెద్ద అభిమానిని’ అంటూ కంగనా రాసుకొచ్చింది. అంతేకాదు రేపు కుటుంబంతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి వెళ్తున్నానని, మరి మీరేప్పుడు చూస్తారు? అని మరో స్టోరీలో పేర్కొంది. కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కోమురంభీంగా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌, హాలీవుడ్‌ బ్యూటీ ఒలివియాలు హీరోయిన్లుగా నటించారు. ఇక బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, శ్రియా సరణ్‌లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement