Sameera Reddy Opens Up on She Diagnosed With Alopecia Areata in 2016 - Sakshi
Sakshi News home page

Sameera Reddy: నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా

Mar 30 2022 6:17 PM | Updated on Mar 30 2022 8:37 PM

Sameera Reddy Opens Up On She Diagnosed With Alopecia Areata in 2016 - Sakshi

ఆస్కార్‌ అవార్డు 2022 ఈవెంట్‌ చోటు చేసుకున్న సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన భార్య అనారోగ్యం గురించి కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ స్టేజ్‌పై మాట్లాడుతూ హాస్యం చేసినందుకు హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ అతడి చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘనపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ దీనిపై స్పందిస్తూ ఆ పరిస్థితుల్లో తాను కూడా అలాగే చేసేదాన్ని అంటూ స్మిత్‌కు మద్దతుగా నిలిచింది. ఇక తాజాగా నటి సమీరా రెడ్డి కూడా స్పందించింది. స్మిత్‌ భార్యను బాధించిన అలోపేసియా ఏరియాటా వ్యాధి గురించి చెప్పుకొచ్చింది.

చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌

తను కూడా గతంలో అలోపేసియా వ్యాధితో బాధపడినట్టు సీక్రెట్‌ రీవిల్‌ చేసింది. అంతేకాదు ఈ వ్యాధి అంటే ఏంటో కూడా సమీరా వివరించింది. ‘ప్రతి ఒక్కరు జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో బాధపుడుతుంటారు. ఇటీవల ఆస్కార్‌ వివాదం నన్ను దీనిపై మాట్లాడేలా చేసింది. ఇంతకి అలోపేసియా అంటే ఏమిటో తెలుసా? ఇది ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. దీని వల్ల మీ జుట్టు కుదుళ్ల నుంచి ప్యాచ్‌లుగా ఊడిపోతుంది. 2016లో నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను.  ఒక రోజు నా తల వెనక భాగంలో 2 ఇంచుల మేర నా జుట్టు ఉడిపోయి ఉండటం నా భర్త అక్షయ్‌ గమనించాడు. ఒక నెలలోనే రెండు మూడు చోట్ల నా జుట్టు ఊడిపోయి కనిపించింది.

చదవండి: ఆగిపోయిన ప్రభాస్‌ సలార్‌ షూటింగ్‌!.. కారణం అదేనా?

ఇది అంటూ వ్యాధి కాదు, ఇది మనల్ని ఎలాంటి అనారోగ్యానికి కూడా గురి చేయదు. కానీ చూట్టు రాలిపోవడం అంటే మానసికంగా కుంగదీస్తుంది. ఈ అలోపేసియా ఏరియాటా ఎందుకు వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ.. ఇది మాత్రం పెద్ద వ్యాధి కాదు’ అంటూ సమీరా రాసుకొచ్చింది. అలాగే తను ఈ సమస్య నుంచి బయటపడ్డానని, ప్రస్తుతం తన తలలో ఎలాంటి ప్యాచ్‌లు లేవని ఆమె తెలిపింది. కాగా సమీరా రెడ్డి జై చిరంజీవా మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అశోకా వంటి చిత్రాల్లో తన నటన, డాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సమీరారెడ్డి.. అంతే తక్కువ సయమంలో ఇండస్ట్రీకి దూరమైంది. అక్షయ్‌ అనే వ్యాపావేత్తను పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది సమీరారెడ్డి. 

Advertisement
 
Advertisement
Advertisement