అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే! | Urvashi Rautela Unveils ICC World Cup 2023 Trophy In Front Of Eiffel Tower In France - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: వరల్డ్ కప్‌తో ఊర్వశి రౌతేలా.. రిషబ్ భయ్యా కోసమేనా!

Published Wed, Aug 23 2023 7:27 PM | Last Updated on Wed, Aug 23 2023 7:57 PM

Urvashi Rautela Unveils ICC World Cup 2023 Trophy In Front Of Eiffel Tower - Sakshi

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు అభిమానులను మెప్పించింది. బాస్ పార్టీ అంటూ సాగే సాంగ్‌తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ భామ  అరుదైన అవకాశాన్ని అందుకుంది. అదేంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: 'స‍్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు! )

ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్‌ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు. అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ  ఊర్వశి రౌతేలా ఆవిష్కరించింది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచింది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వరల్డ్‌ కప్‌ ముందు ఫోటోలకు పోజులిచ్చింది.  పంచుకుంది. ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'రిషబ్ భయ్యా దృష్టిలో పడేందుకేనా..' అంటూ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.. ఇక నెక్స్ట్ రిషబ్ భయ్యా వంతు అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు.. రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. 

రిషభ్ పంత్‌తో డేటింగ్ రూమర్స్

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. కాగా.. గతంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో ఊర్వశి రౌతేలా డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ఈ ఫోటో చూసిన రిషబ్ పంత్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. 

(ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్‌లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement