అప్పుడు నమిలేసిన చూయింగ్ గమ్‌తో, ఇప్పుడు చెట్టు బెరడుతో..ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

Urfi Javed Wears A Dress Made Of Tree Bark Netizens Trolled - Sakshi

విభిన్నమైన దుస్తులు ధరిస్తూ వార్తల్లో నిలుస్తుంది బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావేద్‌. హిందీలో ఓ సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫీ.. బిగ్‌బాస్‌ ఓటీటీలో పాల్గొని ఫేమస్‌ అయింది. ఆ తర్వాత విచిత్రమైన డ్రెస్సులు ధరిస్తూ.. సోషల్‌ మీడియా స్టార్‌గా ఎదిగింది. ముంబైలో ఉర్ఫీ ఏ ప్రాంతానికి వెళ్లినా కెమెరాల కన్ను ఆమె వైపు తిరుగుతాయి. దానికి కారణం ఆమె ధరించిన డ్రెస్సే. ఒంటి నిండా దుస్తులు ధరించడం ఆమెకు అస్సలు నచ్చదు.

తాజాగా ఉర్ఫీ ధరించిన డ్రెస్‌ ఒక్కటి నెట్టింట వైరల్‌ అవుతోంది. చెట్టు బెరడుతో తయారు చేసిన డ్రెస్‌ వేసుకొని ఫోటో షూట్‌ చేసింది ఉర్ఫీ.  ఈ అవుట్‌ఫిట్‌ తయారు చేసే క్రమంలో ఏ చెట్టుకు హానీ కలగలేదని చెప్పింది. ఉర్ఫీ తాజా ఫోటోలపై నెటిజన్స్‌ స్పందిస్తూ.. ‘నువ్వు ధరించిన ఆ డ్రెస్‌ ఆవు పేడతో తయారు చేసినట్లు ఉంది. ప్రతిదీ ట్రెండ్‌ అవుతుందని ఊహించుకోకు’ అని విమర్శిస్తున్నారు.

(చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్‌)

గతంలోనూ ఉర్ఫీపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఓ సారి నెమలి డ్రెస్‌ అంటూ నెమలి డ్రెస్‌ అంటూ అర్ధనగ్నంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అలాగే ఓ సారి చూయింగ్‌ డ్రెస్‌ అంటూ నమిలి ఊసిన చూయింగ్ గమ్‌లను శరీరానికి అంటించుకొని ఫోటో షూట్‌ చేసింది. ఇలా ఫ్యాషన్‌ పేరుతో ఒక్కోసారి ఒక్కో వెరైటీ దుస్తులు ధరిస్తూ పరువు తీస్తుందని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top