
సినిమా సెలబ్రిటీల జీవనశైలి ఎప్పుడూ ఒక మాయాజాలంలా అభిమానులను, సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. వారు ధరించే దుస్తులు మొదలు వాడే వస్తువుల వరకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. వారు ఇళ్లలో ఎలా ఉంటారు? రోజువారీ జీవితంలో వారి ఆహారపు అలవాట్లు ఏమిటి? జీవిత భాగస్వామితో వాళ్లు ఎలా ఉంటారు? తదితర విషయాలపై అందరికి ఆసక్తి ఉంటుంది. అందుకే పలు ఇంటర్వ్యూల్లో సినీ ప్రముఖులు తమ పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

ఆ పేరుతో చరణ్ మొబైల్ నెంబర్
సాధారణంగా భార్యభర్తలు తమ భాగస్వామి మొబైల్ నెంబర్లను ముద్దు పేరుతో సేవ్ చేసుకుంటారు. మహిళలు అయితే తమ భర్త పేరుని హబ్బీ, బేబీ, స్వీట్‌హార్ట్, మై లవ్..తదితర పేర్లతో సేవ్ చేసుకుంటారు. కానీ ఉపాసన మాత్రం చరణ్ నెంబర్‌ని వెరైటీ పేరుతో సేవ్ చేసుకుంది. తన ఫోన్‌లో చరణ్ నెంబర్‌ని ‘రామ్ చరణ్ 200(Ram Charan 200)’ అనే పేరుతో సేవ్ చేసుకుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఉపాసననే తెలియజేస్తూ..ఆ పేరు వెనుక ఉన్న కథ కూడా చెప్పింది.

అందుకే ఆ పేరు..
చరణ్ నెంబర్‌ని రామ్ చరణ్ 200 అని ఎందుకు సేవ్ చేసుకుందో ఉపాసన వివరించింది. ప్రస్తుతం చరణ్ వాడుతున్న సిమ్ సంఖ్య ఇదట. ఇప్పటి వరకు ఆయన 199 సార్లు తన మొబైల్ నెంబర్‌ని మార్చుకున్నారట. ప్రస్తుతం వాడుతున్నది 200వ నెంబర్ అట. అందుకే రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకున్నానని నవ్వూతూ చెప్పింది ఉపాసన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చరణ్ 200 సార్లు మొబైల్ నెంబర్స్ మార్చారా? అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.