బాత్రూమ్‌లో లైబ్రరీ ఏర్పాటు చేయించుకున్న హీరో | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు కొత్త సబ్బు కనిపిస్తే చాలు బ్యాగులో వేసుకుంటాడట!

Published Sun, Jun 12 2022 5:00 PM

Unknown And Interesting Facts About Salman Khan, Saif Ali Khan And Amitabh Bachchan - Sakshi

సెలబ్రిటీల జీవన శైలి అంటే ఆసక్తి చూపనిదెవరు? అందునా పాపులర్‌ పర్సన్స్‌ అలవాట్లు, అభిరుచుల పట్ల చెవి రిక్కించని వారెవరు? ఆ గుంపులో మేమూ ఉన్నాం. అందుకే ఈ వివరాలు పోగేసుకొచ్చాం..!

శారీ సుందరి..
తెలుసు మీకర్థమైందని! విద్యా బాలనే. ఇక్కడ చెప్పబోయేది కూడా ఆమెకున్న చీరల పిచ్చి గురించే. ఎక్కడ ఏ కొత్త రంగు.. డిజైన్‌.. నేతలో చీర కనిపించినా అది తన క్లాజెట్‌లో క్లోజ్‌ చేసుకునేదాకా నిద్రపోదట విద్యాబాలన్‌. నిద్రంటే గుర్తొచ్చింది.. రాత్రి కలలో కూడా తను చీరలోనే కనిపించాలని నిద్రపోయేప్పుడూ చీర కట్టుకునే నిద్రకుపక్రమిస్తుందని ఆమె సన్నిహితుల ఉవాచ. అన్నట్టు విద్యాబాలన్‌ లీస్ట్‌ బాదర్డ్‌ థింగ్‌ ఈజ్‌ సెల్‌ ఫోన్‌. అభిమానులూ.. ఆమె నంబర్‌ సంపాదించి ఆమెకు మెసేజ్‌ పెట్టేరూ..! ఆర్నెల్లయినా చూసుకోదట. ఫ్యాన్స్‌ సందేశాలే కాదు.. ఆమెకు పనిచ్చేవాళ్ల సమాచారాలను కూడా. అలా విద్యా చాలా ముఖ్యమైన భూమికలను, అత్యంత ప్రధానమైన ఈవెంట్లనూ మిస్‌ అయిన సందర్భాలు బోలెడట. అయినా సెల్‌ ఫోన్‌ను అక్కున చేర్చుకోదట. అదేమంటే ఫోన్‌లో తల దూర్చడం కంటే మనుషులతో మాటలు కలపడమే నాకిష్టం అంటుంది.

వాటే  టైమింగ్‌..
కూలీ సినిమా షూటింగ్‌ సమయంలో అమితాబ్‌ బచ్చన్‌కు యాక్సిడెంట్‌ అయిన విషయం తెలుసు కదా! ఆ ప్రమాదంలో అతని కుడిచేతిక్కూడా గాయమై కొన్నాళ్లపాటు అది కదలకుండా ఉందట. అప్పుడు అన్ని పనులను ఎడమ చేత్తో చేయడం అలవాటు చేసుకున్నాడు అమితాబ్‌.. రాయడం సహా. ఇప్పుడు కుడిచేత్తో ఎంత స్పీడ్‌గా .. సౌకర్యంగా రాయగలడో ఎడమచేత్తోనూ అంతే స్పీడ్‌గా సౌకర్యంగా రాయగలడు ఆ హీరో. సో వాట్‌.. ప్రాక్టీస్‌ మేక్స్‌ మ్యాన్‌ పర్‌ఫెక్ట్‌ అంటారా? అవును ఆ ప్రాక్టీస్‌ ఆ మ్యాన్‌ని ఎంత ఎక్స్‌పర్ట్‌ను చేసిందంటే రెండు వేర్వేరు విషయాలను ఏకకాలంలో రెండు చేతులతో రాసేంతగా! దటీజ్‌ బిగ్‌ బి.. అంటూ అభిమానులంతా ఆయనకు బిగ్‌ హ్యాండ్‌ ఇవ్వడం మొదలెట్టేశారా!

గోర్లు బలి
ఆందోళన, కంగారు, ఒత్తిడి వగైరాను ఎదుర్కోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కోతరహా. కానీ చాలామందిది ఒకే తరహా. ఏ కాస్త టెన్షన్‌.. స్ట్రెస్‌ ఫీలైనా వేలి గోళ్లను కరచుకుని కొరికేస్తుంటారు. ఆ లిస్ట్‌లో కరీనా కపూర్‌ కూడా ఉంది. అవును.. పాపం.. ఏ కాస్త కంగారు కలిగినా వేలి గోళ్లను దానికి బలిచ్చేస్తూంటుందట. హమ్మయ్య.. సెలబ్రిటీలూ సామాన్యులే ఈ విషయంలో అని సారూప్యత వెదుక్కోవచ్చు.

ఇట్స్‌ నాటే లై
వాష్‌రూమ్‌లో వార్తా పత్రికలు చదవడం చాలామందికి అనుభవం. కానీ పుస్తకాలు చదవడం చాలా మందికి కొత్తే! కానీ సైఫ్‌ అలీఖాన్‌కు చాలా చాలా పాత అలవాటు. అతను చిన్నప్పటి నుంచీ బాత్రూమ్‌లోనే పుస్తకాలు చదివేవాడట. సో పెద్దయ్యాకా.. అంటే నటుడిగా స్థిరపడ్డాక.. ఏకంగా బాత్రూమ్‌లోనే లైబ్రరీని ఏర్పాటు చేయించుకున్నాడు. చదవాలనిపించినప్పుడల్లా వాష్‌రూమ్‌లోకి దూరుతున్నాడని కరీనా కపూర్‌ కంప్లయింట్‌ చేస్తుందేమో!

స్టాంప్సా? కాదు..
.. మరేంటి? సోప్స్‌! ఊప్స్‌..! ఎస్‌.. సల్మాన్‌ ఖాన్‌ ఏ కొత్త చోటుకి వెళ్లినా అక్కడ కనిపించిన సోప్స్‌ను తీసి బ్యాగ్‌లో వేసుకుంటాడట. ఏంటయ్యా అది? అని అంటే.. సోప్స్‌ కలెక్షన్‌ అని ఆన్సర్‌ చేస్తాడట. అలా తెచ్చుకున్న సోప్స్‌తో షవర్‌ ఎక్స్‌పరిమెంట్స్‌ చేస్తాడని బాలీవుడ్‌లో బ్యాడ్‌ టాక్‌.

చదవండి: చిరు ఇంట్లో విక్రమ్‌ టీంకు గ్రాండ్‌ పార్టీ, సల్మాన్‌ ఖాన్‌ సందడి
16 ఏళ్ల తర్వాత వెబ్‌సిరీస్‌తో నటి రీ ఎంట్రీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Advertisement
 
Advertisement