ట్వింకిల్ బాంబ్‌: ట్రోలింగ్‌కు కౌంట‌ర్‌ | Twinkle Bomb: Twinkle Khanna Shuts Down Trolls | Sakshi
Sakshi News home page

న‌టిపై ట్రోలింగ్‌: దేవుళ్ల మీదే ఎగ‌తాళా?

Nov 8 2020 5:44 PM | Updated on Nov 8 2020 6:49 PM

Twinkle Bomb: Twinkle Khanna Shuts Down Trolls - Sakshi

దేవుళ్ల‌కు జోకులంటే ఇష్టం, లేదంటే నిన్ను ఎందుకు పుట్టిస్తాడు....

తెలుగు. త‌మిళ‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్రం 'కాంచ‌న' హిందీలో రీమేక్ అవుతున్న‌ విష‌యం మీకు తెలిసిందేగా.. బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ ఈ సినిమాకు తొలుత‌ 'ల‌క్ష్మీ బాంబ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ట్రైల‌ర్‌లోని కొన్ని స‌న్నివేశాలు మా మ‌నోభావాల‌ను దెబ్బ తీస్తున్నాయంటూ కొంద‌రు హిందూ పెద్ద‌లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. టైటిల్‌ కూడా ల‌క్ష్మీ దేవిని అవమానించేలా ఉంద‌ని ఆరోపించారు. దీంతో అన‌వ‌స‌ర వివాదాల‌ను నెత్తినెక్కించుకోవ‌డం ఎందుక‌ని త‌ల‌చిన చిత్ర‌యూనిట్‌ త‌మ సినిమా పేరును స‌వ‌రించి "ల‌క్ష్మీ"గా ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకొ‌స్తోంది. అయినా స‌రే ల‌క్ష్మీ సినిమాపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ ఆగ‌డం లేదు. ఇందులోకి అక్ష‌య్ భార్య ట్వింకిల్ ఖ‌న్నాను సైతం లాగుతున్నారు. (చ‌ద‌వండి: ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ)

ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి దానిపై ట్వింకిల్ బాంబ్ అని రాసుకొచ్చారు. ఇందులో ట్వింకిల్ శ‌రీరాన్ని నీలి రంగులోకి మార్చి నుదుటిన ఎర్ర‌టి బొట్టు పెట్టారు. ఈ ఫొటో కాస్త ట్వింకిల్ కంట ప‌డ‌గా, త‌న‌పై జ‌రుగుతున్న ట్రోలింగ్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌రిచ్చారు. తనే స్వ‌యంగా ట్వింకిల్ బాంబ్ అని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. "ఒక‌రు ఈ ఫొటోకు న‌న్ను ట్యాగ్ చేసి థ‌ర్డ్ క్లాస్ ప‌ర్స‌న్‌. దేవుడి మీద జోకులేసి ఎగ‌తాళి చేస్తారా?.. అంటూ కామెంట్ చేశారు. అవును, దేవుళ్ల‌కు జోకులంటే చాలా ఇష్టం.. లేక‌పోతే నిన్నెందుకు భూమి మీద‌కు పంపిస్తాడు? పోనీలే.. ఈ ఫొటో సాయంతో నేను దీపావ‌ళికి ప‌టాసులా రెడీ అవుతాను" అని రాసుకొచ్చారు. కాగా ల‌క్ష్మీ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో రేపు(న‌వంబ‌ర్ 9న‌) రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌చించారు. (చ‌ద‌వండి: ‘కొత్త పంథాకు తెరలేపాను.. అందుకే ఇలా!’)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement