మొహం చాటేసిన స్టార్‌ హీరో భార్య.. అసలేమైంది! | Twinkle Khanna Hiding Her Face From Media There Is Reason | Sakshi
Sakshi News home page

‘కొత్త పంథాకు తెరలేపాను.. అందుకే ఇలా!’

Mar 12 2020 8:53 PM | Updated on Mar 12 2020 9:51 PM

Twinkle Khanna Hiding Her Face From Media There Is Reason - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ భార్య, నటి ట్వింకిల్‌ కన్నా మీడియాకు మొహం చాటేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గత శుక్రవారం బంద్రాలో జరిగిన ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్న ఆమె.. తిరిగి వెళుతుండగా మీడియాకు తన మొహం కనిపించకుండా తెల్లని టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకున్నారు. అలా పేపర్‌తో ముఖాన్ని కప్పేసుకున్న ట్వింకిల్‌ వైపే కెమెరాలను ఫోకస్‌ చేయడంతో.. ఇంకా జాగ్రత్తగా తన ఫేస్‌ను కప్పేసుకుంటూ కారెక్కి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వింకిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘నేను ఇలా ప్రవర్తించిన తర్వాత ఇక మీడియా తన దైన శైలిలో స్పందిస్తుంది. అయితే నేను ఇలా చేయడం వెనక గల కారణం తెలిస్తే మీరంతా షాక్‌ అవుతారు. అదేంటో త్వరలోనే ప్రకటిస్తా. ఓ కొత్త పంథాకు తెరలేపాను. అదేంటో తెలియాలంటే కాస్త వేచి ఉండండి’ అని ట్వింకిల్‌ పేర్కొన్నారు. ఇక ట్వింకిల్‌ తీరును చూసిన నెటిజన్లు ఆమె అలా ఎందుకు ప్రవర్తించి ఉంటారనే ఆలోచనలో పడ్డారు. 


నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను!

కాగా, ట్వింకిల్‌ తన న్యూలుక్‌ను దాచుకోవడం కోసమే ఇలా చేసుంటారని.. మీడియా కెమెరాలను తప్పించుకోవడం కోసం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తన చుట్టు ఉన్న వారంతా నవ్వుతుండడమే కాక ట్వింకిల్‌ కూడా మొదటి నుంచి నవ్వుతూ కనిపించారు’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే ఇది కరోనా వైరస్‌ నుంచి సంరక్షించుకోవడానికి మాస్క్‌లు ధరించాలనే సంకేతాన్ని సూచిస్తూ సరదగా చేసుంటారని నెటిజన్లు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక అసలు విషయం తెలియాలంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement