లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ సీరియల్‌ నటుడు అరెస్టు | TV actor Pracheen Chauhan Arrested In Girl Molestation Case | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ సీరియల్‌ నటుడు అరెస్టు

Jul 3 2021 8:56 PM | Updated on Jul 3 2021 9:23 PM

TV actor Pracheen Chauhan Arrested In Girl Molestation Case - Sakshi

లైంగిక ఆరోపణల కేసులో ప్రముఖ బుల్లితెర నటుడు ప్రాచీన్‌ చౌహాన్‌ అరెస్టు అయ్యాడు. ప్రాచీన్‌ ఓ బాలికను వేధింపులకు గురి చేశాడని ఇటీవల అతడిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  ముంబైలోని మాల్డ్‌ ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో అతడిపై సదరు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రాచీన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

అయితే అతడి అరెస్టుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగానే ముంబై బోరివాలి కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల నాగినీ 3 ఫేం పరల్‌ వీ పూరీ కూడా లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా బుల్లితెరపై రెండు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్న ప్రాచీన్‌ ‘కసౌతి జిందగీ కే’ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనికి ముందు ‘హతీమ్‌, మాట్‌ పితా కే చార్నర్‌ మెయిన్‌ స్వర్గ్‌ ’వంటి టీవీ షోలలో నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement