
‘‘అమర్‌సింగ్ చంకీల’ సినిమా అద్భుతంగా ఉంది. అమర్‌సింగ్ పాత్రలో దిల్జిత్ దొసాంజ్ ఒదిగిపోయారు. ఎంత అద్భుతంగా నటించారో చెప్పడానికి మాటలు రావడం లేదు’’ అన్నారు ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రి. పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీల(27 ఏళ్లకే హత్య చేయబడ్డారు) బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘అమర్‌సింగ్ చంకీల’. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పరిణితీ చోప్రా, దిల్జిత్ దొసాంజ్ లీడ్ రోల్స్ చేశారు.
ఈ నెల 12న నెట్‌ఫ్లిక్స్‌లో ‘అమర్‌సింగ్ చంకీల’ విడుదలైంది. అయితే బాలీవుడ్ సినీతారల కోసం ముంబయ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం త్రిప్తి దిమ్రి మాట్లాడుతూ–‘‘చాలా రోజుల తర్వాత నేను చూసిన ఉత్తమ చిత్రమిది. అమర్ జ్యోత్ పాత్రకి పరిణీతి చక్కగా సరిపోయారు. ఇలాంటి మంచి సినిమాని మాకు అందించినందుకు ఇంతియాజ్‌కి థ్యాంక్స్’’ అన్నారు.