Top Gear: నువ్వు నా వెన్నెల... | Top Gear: Aadi Sai Kumar, Riya Suma Vennela Lyrical Video Launch | Sakshi
Sakshi News home page

Top Gear: నువ్వు నా వెన్నెల...

Nov 26 2022 12:34 AM | Updated on Nov 26 2022 12:34 AM

Top Gear: Aadi Sai Kumar, Riya Suma Vennela Lyrical Video Launch - Sakshi

‘వెన్నెల వెన్నెల.. నువ్వు నా వెన్నెల.. దైవమే ప్రేమగా పంపేనే నిన్నిలా...’ అంటూ సాగుతుంది ‘వెన్నెల వెన్నెల...’ పాట. ఆది సాయికుమార్, రియా సుమన్‌ జంటగా కె.శశికాంత్‌ డైరెక్షన్‌లో రూపొందిన ‘టాప్‌ గేర్‌’ చిత్రంలోని పాట ఇది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అదించగా, సిధ్‌ శ్రీరామ్‌ పాడారు.

కేవీ శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 30న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీలోని ‘వెన్నెల వెన్నెల’ అనే పాట లిరికల్‌ వీడియోను  విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గిరిధర్‌ మామిడిపల్లి. 

Advertisement
 
Advertisement
Advertisement