పెద్ది రిలీజ్‌ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్‌కేఎన్ | Tollywood Producer SKN Clarity On Peddi Movie Release Date Comments | Sakshi
Sakshi News home page

SKN: పెద్ది రిలీజ్ డేట్.. పొరపాటు నాదే..: నిర్మాత ఎస్‌కేఎన్

Mar 31 2026 7:34 AM | Updated on Mar 31 2026 9:05 AM

Tollywood Producer SKN Clarity On Peddi Movie Release Date Comments

రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చెర్రీ బర్త్‌ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రెజ్లర్‌ లుక్‌లో కనిపించిన ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై టాలీవుడ్‌లో మాత్రం పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. మరోసారి వాయిదా పడనుందని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన కామెంట్స్ పెద్ది రిలీజ్ డేట్‌పై గందరగోళం క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు.

చెన్నై లవ్ స్టోరీ సాంగ్‌ ఈవెంట్‌లో మా సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చించుకున్నామని ఎస్‌కేఎన్ తెలిపారు. అదే సందర్భంలో జూన్ 25న పెద్ది రిలీజ్‌ అవుతుందేమోనని సాయి రాజేశ్‌ అన్నారు. కానీ అక్కడ గందరగోళంలో పెద్ది రిలీజ్‌ అనౌన్స్‌ చేశారమో అనుకున్నానని వెల్లడించారు. నేను తప్పుగా అర్థం చేసుకుని అలా చెప్పా.. అంతేకానీ పెద్ది మూవీ రిలీజ్‌ వాయిదా అనేది అఫీషియల్‌గా రాలేదని చెప్పారు. నా కామెంట్స్‌ వల్ల చిన్న పొరపాటు జరిగిందని.. ఇలా అయినందుకు మీ అందరికీ సారీ అంటూ నిర్మాత ఎస్‌కేఎన్ క్లారిటీ ఇచ్చారు.

కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన  ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement