ఎనిమిది భాషల్లో రికార్డు బ్రేక్‌  | Sakshi
Sakshi News home page

ఎనిమిది భాషల్లో రికార్డు బ్రేక్‌ 

Published Sat, Mar 2 2024 6:08 AM

Tollywood Movie Record Break Lyrical Song Released - Sakshi

నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, కాశీ విశ్వనాథ్‌ ముఖ్య తారలుగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ పై చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రం ‘రికార్డు బ్రేక్‌’. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో 8 భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మళ్లీ పుట్టి వచ్చినవా..’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. సాబు వర్గీస్‌ సంగీత సారథ్యంలో వరికుప్పల యాదగిరి ఈ పాటకు లిరిక్స్‌ అందించి, పాడారు. ‘‘అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు.

Advertisement
Advertisement