
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ఈ నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా అన్నదమ్ముల ఎమోషనల్ సాంగ్ను విడుదల చేశారు.
ఈ సినిమాలో విజయ్, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించారు. ఈ ఇద్దరి అనుబంధం నేపథ్యంతో రూపొందిన అన్నా అంటూనే అనే సాంగ్ను రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అనిరుధ్ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.