టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్‌చిట్‌ | Sakshi
Sakshi News home page

Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్‌చిట్‌

Published Sat, Sep 18 2021 4:46 PM

Tollywood Drugs Case: Puri Jagannadh, Tarun Gets Clean Chit From FSL - Sakshi

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, తరుణ్‌లకు ఫోరెన్సిక్‌  సైన్స్‌ ల్యాబ్‌(ఎఫ్ఎస్‌ఎల్‌)క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2017లో వాళ్లు ఇచ్చిన గోళ్లు, వెంట్రుకలు, రక్తం నమునాల్లో డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్‌  ల్యాబ్‌ తేల్చి చెప్పింది.

2017 జులైలో పూరి జగన్నాథ్‌, తరుణ్ నుంచి ఎక్సైజ్‌శాఖ నమూనాలు సేకరించింది.  దీనిపై గతేడాది డిసెంబరు 8న ఎఫ్ ఎస్‌ఎల్‌ నివేదికలు సమర్పించినట్టు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌తో పాటు ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదిక వివరాలను కోర్టుకు సమర్పించినట్టు ఎక్సైజ్‌ అధికారులు వివరించారు.  

 
Advertisement
 
Advertisement