Tollywood Drugs Case: అప్పుడు రకుల్..ఇప్పుడు నందు: 'ముందుగానే హాజరు కావాల్సిన అవసరం ఏంటి'?

Actor Nandu Appears At Enforcement Directorate: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ చార్మీ, రకుల్ ఈడీ విచారణను ఎదుర్కున్నారు. తాజాగా నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు నేడు (సెప్టెంబర్7)న ఈడీ ఎదుట హాజరయ్యారు. నిజానికి ఈనెల 20న నందు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత కారణాలతో నేడు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు.
కాగా గతంలో హీరోయిన్ రకుల్ సైతం నోటీసులో పేర్కొన్న దాని కంటే ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు నందు సైతం 13రోజుల ముందుగానే విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో నందును విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు నందును విచారిస్తున్నారు. ఈ క్రమంలో చార్మీ, రకుల్‌తో పరిచయాలు, ఎఫ్ క్లబ్‌తో ఉన్న సంబంధాలపై నందుపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. గతంలోనూ 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణను సైతం నందు ఎదుర్కున్న సంగతి తెలిసిందే.
చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
రియా చక్రవర్తితో సంబంధమేంటి?