Poonam Kaur: త్వరలోనే బయటపెడతానంటూ పూనమ్‌ కామెంట్స్‌

Poonam Kaur Sensational Comments On Tollywood Drugs Case - Sakshi

Poonam Kaur: టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే  కేసులో డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరోయిన్స్‌ చార్మీ, రకుల్‌ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌, నవ్‌దీప్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, నందు, తరుణ్‌లకు ఈడీ అధికారులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

విచారణలో భాగంగా మరికొంత మంది నటీనటుల పేర్లు సైతం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.తాజాగా టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంపై స్పందించిన  నటి పూనమ్‌ కౌర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డ్రగ్స్‌ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. సరిహద్దు సమస్య. పొలిటికల్‌ అజెండాతో జరుగుతున్న వ్యవహారం. బలమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటాను అని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం పూనమ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top