
Tharun Appears Before ED In Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులను విచారించిన ఈడీ నేడు హీరో తరుణ్‌ను ప్రశ్నించింది. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై ఆయనను ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. కెల్విన్‌తో సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై ఈడీ విచారించింది. గతంలో 2017లో సైతం తరుణ్ ఎక్సైజ్ విచారణను సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
చదవండి : 'సెలబ్రిటీల వద్ద డ్రగ్స్ లభించలేదు...కెల్విన్ వాంగ్మూలం సరిపోదు'
కాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తెల్చి చెప్పిన సంగతి తెలిసిందే. సినీతారలపై కెల్విన్ ఇచ్చిన కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని, కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఈ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్‌లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్‌ఎల్)క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ చార్జిషీట్‌ను ఈడీ పరిధిలోకి తీసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
చదవండి : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్‌చిట్