హార్స్ రైడింగ్‌.. బాహుబలి-2 జ్ఞాపకాల్లో మిల్కీ బ్యూటీ.. .! | tollywood actress tamanna shares Bahubali 2 day memories | Sakshi
Sakshi News home page

Tamanna: హార్స్ రైడింగ్.. బాహుబలి-2 జ్ఞాపకాల్లో మిల్కీ బ్యూటీ.. !

Jan 18 2026 6:54 PM | Updated on Jan 18 2026 6:54 PM

tollywood actress tamanna shares Bahubali 2 day memories

టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్‌తోనూ అభిమానులను అలరిస్తోంది. తెలుగులో పలు బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా బాహుబలి-2 మూవీ రోజులను గుర్తు చేసుకుంది.

బాహుబలి-2 కోసం గుర్రపు స్వారీ తరగతులను మరోసారి గుర్తు చేసుకుంది. ఈ మూవీ కోసం తాను చేసిన సాధనతో పాటు తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తన హెయిర్ కట్ ఆ రోజుల్లో చాలా బాగుండేదని తెలిపింది. అంతేకాకుండా చివర్లో బాహుబలి ప్రమోషన్ల సమయంలో దిగిన ఫోటోషూట్ అంటూ బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించింది.

కాగా.. గతేడాది ఓదెల -2తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తమన్నా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. హిందీలో రోమియో, రేంజర్‌ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement