టాలీవుడ్ నటుడు బాబు మోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్వర్గీయ ఎన్టీఆర్‌కు సమాధికి నివాళువలర్పించేందుకు వెళ్లగా.. ఈ సంఘటన జరిగింది. కొందరు ఎన్టీఆర్ అభిమానులు బాబు మోహన్‌ను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గేట్లు మూసివేశారంటూ బాబు మోహన్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైరయ్యారు. వారితో కాసేపు బాబు మోహన్ కూడా వాదించారు. చివరికీ గొడవ సద్దుమణగడంతో ఎక్కడివారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాబు మోహన్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు సైతం స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనను తలచుకున్నారు.
ఎన్టీఆర్ ఘాట్ దగ్గర బాబు మోహన్ మీద విరుచుకుపడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ...దళితుడు అంటే ఇంత చిన్న చూపా?? @ncbn pic.twitter.com/ZXZYfZNhyz
— Hungry కుక్క 🐕 (@Truth_Exposer__) January 18, 2026


