
అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం 'తెరచాప'. కైలాష్ దుర్గం నిర్మాతగా దీనిని నిర్మిస్తున్నారు. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రాజేష్ భూపతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్, ఎం ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్‌లో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్‌ను తాజాగా లాంచ్ చేశారు.

ఈ సందర్బంగా హరికథ దర్శకుడు మ్యాగి మాట్లాడుతూ... 'ఈ సినిమా టీం గురించి నాకు పెద్దగా తెలీదు.. కానీ, వీళ్లు పెట్టిన ఎఫోర్ట్స్ ఎంత బలంగా ఉందో టీజర్‌లో చూశాను. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది.' అని అన్నారు.
ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం మాట్లాడుతూ.. 'మా సినిమాని ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు.. నాకు చిత్రపరిశ్రమ చాలా కొత్త. సినిమా రంగంలో ఇదే మా ఫస్ట్ సినిమా. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాం' అని అన్నారు.