Thank You Twitter Review: ‘థ్యాంక్యూ’ మూవీ ఎలా ఉందంటే..

Thank You Movie Twitter Review In Telugu - Sakshi

‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌ చేయడంతో ‘థ్యాంక్యూ’పై ఆసక్తి పెరిగింది.

భారీ అంచనాల మధ్య నేడు(జులై 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘థ్యాంక్యూ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

‘థ్యాంక్యూ’ బ్యూటిఫుల్‌ ఫీల్‌గుడ్‌ మూవీ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. నాగచైతన్య యాక్టింగ్‌ పరంగా అదరగొట్టేశారని అంటున్నారు. మరికొంతమంది రోటీన్‌గా ఉందని, ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిందని చెబుతున్నారు. 

‘థ్యాంక్యూ’లో కృతజ్ఞత ఉంది కాని మ్యాజిక్‌ చేయలేకపోయింది. విక్రమ్‌ కె కుమార్‌ కొత్తగా ట్రై చేసిన ఎక్కడో తేడా కొట్టింది. సోల్‌ మిస్‌ అయింది. లుక్స్‌ పరంగా నాగచైతన్య కొత్తగా కనిపించాడు. కానీ పూర్తిస్థాయి నటనను కనబర్చలేకపోయాడు. రన్‌టైమ్ కూడా ల్యాగ్ అయినట్లు అనిపించింది’అంటూ ఓ నెటిజన్‌ 2.5 రేటింగ్‌ ఇచ్చాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top