Thank You Movie First Day Box Office Collection Thank You Movie First Day Box Office Collection - Sakshi
Sakshi News home page

Thank You Box Office Collection: తొలి రోజు దారుణమైన కలెక్షన్స్‌

Jul 23 2022 3:00 PM | Updated on Jul 23 2022 3:55 PM

Thank You Movie First Day Box Office Collection - Sakshi

నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. ‘మనం’లాంటి క్లాసిక్‌ హిట్‌ తర్వాత నాగచైతన్య, విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమిది. అవికా గోర్, మాళవికా నాయర్‌  ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

(చదవండి: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ)

భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో  వసూళ్లని రాబట్టలేకపోయింది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం  తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.65 కోట్ల మాత్రమే వసూలు చేసింది.  మొత్తంగా రూ. 2.16 కోట్లు షేర్  కలెక్షన్స్‌ని రాబట్టింది.  ఈ చిత్రం దాదాపు రూ.24 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. హిట్‌ అని పించుకోవాలంటే దాదాపు రూ. 25 కోట్ల వసూళ్లని రాబట్టాలి.

కానీ తొలి రోజు కేవలం  రూ.2.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇటీవల కాలంలో నాగచైతన్య నటించిన ఏ చిత్రానికి కూడా తొలి రోజు ఇంత తక్కువ కలెక్షన్స్‌ రాలేదు.   తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు చిత్రం తొలి రోజు రూ.9.06 కోట్లు వసూలు చేస్తే.. సోలో హీరోగా నటించిన లవ్‌స్టోరీ రూ. 7.13 కోట్లు, మజిలీ 5.6 కోట్లు వసూలు చేసింది. 

‘థ్యాంక్యూ’ తొలి రోజు కలెక్షన్స్‌..

► నైజాం - రూ. 72 ల‌క్ష‌లు 

► సీడెడ్ - రూ. 20 ల‌క్ష‌లు

► ఈస్ట్ - రూ. 14 ల‌క్ష‌లు 

► వెస్ట్ - రూ. 8 ల‌క్ష‌లు

► ఉత్త‌రాంధ్ర - రూ. 22 ల‌క్ష‌లు

► గుంటూరు- రూ. 10 ల‌క్ష‌లు

► కృష్ణా - రూ. 12 ల‌క్ష‌లు

► నెల్లూరు - రూ. 7 ల‌క్ష‌లు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- రూ.6 లక్షలు

►ఓవర్సీస్‌- రూ. రూ.45 ల‌క్ష‌లు 

►మొత్తం-  2.16 కోట్లు షేర్, రూ.3.70 కోట్లు గ్రాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement