ఇండియన్‌ ఐడల్‌ 2 విన్నర్‌ ఆవిడే.. మర్చిపోలేని జ్ఞాపకమన్న ఐకాన్‌ స్టార్‌!

Telugu Indian Idol Season 2 Winner Announced - Sakshi

సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న ఆహా ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’ గ్రాండ్‌ ఫినాలేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రు అయ్యారు. ఎంతో ఉత్కంఠ‌గా జ‌రిగిన తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫైన‌ల్‌లో విశాఖప‌ట్నానికి చెందిన సౌజ‌న్య భాగ‌వ‌తుల విజేత‌గా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన జ‌య‌రాం, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ‌లు ఫ‌స్ట్‌, సెకండ్ ర‌న్న‌ర‌ప్‌లుగా నిలిచారు. వీరికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. 'సంగీతంలో ఎంతో ప్ర‌తిభావంతులైన వీరి ప్ర‌ద‌ర్శ‌న చూసి మ‌న‌సంతా ఆనందంతో నిండిపోయింది. సంగీతంపై మ‌రింత ప్రేమ పెరిగింది. ఈ షో నాకెంతో ప్ర‌త్యేక‌మైన‌ది, మ‌రిచిపోలేని జ్ఞాప‌కంగా మిగిలింది. సౌజ‌న్య‌కు నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఆమె అసాధార‌ణ‌మైన విజ‌యాన్ని సాధించింది. రెండేళ్ల చిన్నారికి త‌ల్లిగా ఉంటూ ఎంతో అంకిత భావంతో ఈ పోటీల్లో పాల్గొన‌టం.. ఓ వైపు సంగీతం, మ‌రో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవ‌టం అనేది అంత సులువైన విష‌యం కాదు.

ఆమె అంకిత భావం, నిబ‌ద్ధ‌త చూస్తే గౌర‌వం పెరిగింది. ఆమెకు కుటుంబం నుంచి వ‌చ్చిన మ‌ద్ద‌తు ఎంత గొప్ప‌గా ఉందో, దాని ప్రాముఖ్య‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. పెళ్లైన ప్ర‌తి స్త్రీ వెనుక ఆమె భ‌ర్త స‌హ‌కారం ఉండాలి. అలా ఉన్నప్పుడు మ‌హిళ‌లు వారి అనుకున్న ల‌క్ష్యాల‌ను సుల‌భంగా చేరుకుంటారు. అది వారి ఉనికిని అంద‌రికీ తెలిసేలా చేస్తుంది. సౌజ‌న్య సాధించిన ఈ విజ‌యం అంద‌రికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆమె సంగీత ప్ర‌యాణంలో ఇలాంటి విజ‌యాల‌ను మ‌రెన్నింటిలో అందుకోవాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’ విజేతగా నిలిచిన సౌజన్య భాగవతుల మాట్లాడుతూ ‘‘ఆహా వారి తెలుగు ఇండియ‌న్ 2లో విజేత‌గా నిల‌వ‌టం, ముఖ్యంగా అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవ‌టం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. క‌ల నిజ‌మైన‌ట్లు ఉంది.  ఆయ‌న అందించిన ప్రోత్సాహం, ప్ర‌శంస‌లను నేనెప్ప‌టికీ మ‌ర‌చిపోను. ఈ మ్యూజిక‌ల్ జ‌ర్నీ నాలోని ప‌ట్టుద‌ల‌ను మ‌రింత‌గా పెంచింది. ఇంత గొప్ప వేదిక‌ను అందించిన ఆహా వారికి, న్యాయ నిర్ణేత‌ల‌కు, నా తోటి కంటెస్టెంట్స్‌కు, మా వెనుక ఉండి ప్రోత్స‌హించిన టీమ్‌కి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. జీవితంలో ఈ క్ష‌ణాల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఇంకా గొప్ప‌గా రాణించ‌టానికి ప్ర‌య‌త్నిస్తాను’’ అన్నారు. 

తెలుగు ఇండియన్‌ ఐడల్‌ మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. సౌజన్య, జయరాం, లాస్యప్రియతో పాటు న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ టాప్‌-5లో ఉన్నారు.

చదవండి: డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top