Sai Dharam Tej Health Condition Today: పూర్తిగా కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌ - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej Health Condition: పూర్తిగా కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌ 

Sep 21 2021 4:20 AM | Updated on Sep 21 2021 9:54 AM

Telugu Actor Sai Dharam Tej Health Condition Has Completely Recovered - Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్‌ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది.

మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామంది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయిధరమ్‌.. అందరితో మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 10న దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ బైక్‌ స్కిడ్‌ అయి సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement